ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoindi Manasu : అత్తకి షాకిచ్చిన కోడలు.. భర్తతో కలిసి అలా చేయనుందా!

on Oct 20, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -231 లో....రామలక్ష్మి డాక్టర్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్స్ చూపిస్తుంది. డాక్టర్ సీతాకాంత్ కి ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పడంతో అదంతా శ్రీలత ప్లాన్ అని అనుకుంటుంది రామలక్ష్మి. ఇంటికి వెళ్లి కావాలనే టపాసులు కలుస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావని సిరి అడుగుతుంది. నా మనసులోని భయాలు అనుమానాలన్నీ పోయి హ్యాపీగా ఉన్నానంటూ శ్రీలత, శ్రీవల్లిలకి కారం స్వీట్స్.. పెద్దాయన, సిరిలకి మంచి స్వీట్స్ ఇస్తుంది రామలక్ష్మి.

ఆ తర్వాత రామలక్ష్మి తన మాటలతో శ్రీలత, శ్రీవల్లిలని భయపెడుతుంది. దీనికి నిజం తెలిసిపోయిందా అని శ్రీవల్లీతో శ్రీలత అంటుంది. రామలక్ష్మి గదిలోకి వెళ్లి నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని బాధపెట్టాను.. ఇక ఎప్పుడు అలా చెయ్యనని రామలక్ష్మి అనుకొని ఆఫీస్ లో ఉన్న వర్క్స్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి నందిని వచ్చి పాత పెండింగ్ ఫైల్స్ చూడాలని అంటుంది. మేనేజర్ ని పిలిచి సీతాకాంత్ ఫైల్ తీసుకొని రమ్మని అనగానే.. అవసరం లేదు సర్ మీరు రామలక్ష్మి వాళ్ళ పుటింటికి వెళ్తారంట కదా.. ఏ డిస్టబెన్స్ ఉండకూడదని అన్ని వర్క్ రామలక్ష్మి మేడమ్ ఫినిష్ చేశారని మేనేజర్ అనగానే సీతాకాంత్, నందిని ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే  సీతాకాంత్ కి రామలక్ష్మి ఫోన్ చేసి.. వర్క్ అంతా చూసి షాక్ అయ్యారా.. మా పుట్టింటికి వెళదాం. త్వరగా రండి అని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నానని నందినికి చెప్పి బయల్దేరతాడు సీతాకాంత్.

ఆ తర్వాత శ్రీలతకి నందిని ఫోన్ చేసి.. అసలేం జరుగుతుందని అడుగుతుంది. రామలక్ష్మికి నిజం తెలిసినట్లు ఉందని.. అందుకే ఇలా చేస్తుందని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత సిరిని కూడా రామలక్ష్మి తనతో ఇంటికి తీసుకొని వెళ్తానంటే శ్రీలత వద్దని ఆర్గుమెంట్ చేస్తుంది. నేను వెళ్తానని సిరి చెప్తుంది. త్వరలోనే ఈ ఇంటికి వారసుడిని ఇచ్చి.. ఈ ఆస్తులు అన్నింటికి వారసుడిని చేస్తానని రామలక్ష్మి అనగానే.. అప్పుడే సీతాకాంత్ రావడం గమనించి అలా ఏందుకు అంటావ్.. సరైన ప్రవర్తన, బుద్ది, ఉన్నవాళ్ళే వారసులవుతారని శ్రీలత అంటుంది. ఏం అంటావ్ సీతా అని శ్రీలత అనగానే.. అవును మంచి స్వభావం ఉన్నవాళ్లు ఆస్తులకి వారసులు అవుతారని సీతాకాంత్ అంటాడు. మీరు ముందు పదండి రెడీ అవ్వండి వెళ్దామని సీతాకాంత్ తో శ్రీలత అనగానే.. ప్రొద్దున డల్ గా ఉంది. ఇప్పుడు ఇలా ఉందని రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.